- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపావళికి కూతురు పెళ్లి.. ఇంతలోనే ఆత్మహత్య.. అతడే వ్యాపారే కారణమా..?
దిశ, మోత్కూరు: దీపావళి తర్వాత కుమార్తె పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వ్యక్తిని చిట్టీల వ్యాపారి వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్లాట్ రిజిస్ట్రేషన్ పేపర్లు తీసుకొని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన మోత్కూరు పట్టణంలో జరిగింది. ఎస్ఐ జి.ఉదయ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం..
మోత్కూరు కొత్త బస్టాండ్ సమీపంలోని పెద్దమ్మ గుడి ప్రాంతానికి చెందిన కడమంచి ఫణిరాజు(45) అదే కాలనీకి చెందిన చిట్టీల ఏజెంట్ పత్తి బాషాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అతడికి రావాల్సిన డబ్బుల కోసం ఫణిరాజుపై తీవ్ర ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురై అక్టోబర్ 30న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయనను భువనగిరి ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య శాకమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
కాగా మృతుడు ఫణిరాజు దీపావళి పండుగ తర్వాత కుమార్తె పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు భార్య తెలిసింది. తమ ప్లాట్ కాగితాలు ఇవ్వక పోవడం, కుమార్తె పెళ్లి సమయం దగ్గర పడటంతో ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె విలపించింది. చిట్టీ ఏజెంట్ బాషా వేధింపుల వల్లే తన భర్త మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాషా నుంచి పరిహారం ఇప్పించాలని మృతుడి బంధువులు ఉదయం నుంచి పోలీస్ స్టేషన్ ఎదుట పంచాయితీ పెట్టాయి. అయినా బాషా అంగీకరించలేదు. శాకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.ఉదయ్ కిరణ్ తెలిపారు.