- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భార్యకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్న పోలీస్

X
దిశ, వెబ్ డెస్క్: జైలు వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి తన భార్యకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని శివమొగ్గజైలులో అశ్ఫక్(24) అనే వ్యక్తి వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఇతను ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్యకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భయపడిన భార్య.. అలా చేయొద్దని వారించింది. అనంతరం విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసింది. వెంటనే అధికారులు అశ్ఫక్ ఇంటికి వెళ్లి తలుపులు పగులగొట్టి చూడగా.. అప్పటికే అతను ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నట్లు గుర్తించారు. అయితే, అశ్ఫక్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
రూ. 150 కోసం ఇద్దరిని చంపిన వ్యక్తి అరెస్ట్
Next Story