కరోనాతో ఉపాధి పోయింది.. ఊతం లేక ఊపిరే ఆగింది..!

by  |
కరోనాతో ఉపాధి పోయింది.. ఊతం లేక ఊపిరే ఆగింది..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉపాధి కోసం సొంతూరు వదిలి వలస వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్న క్రమంలో కరోనా పిడుగు పడింది. కరోనా తెచ్చిన కష్టాలతో ఉపాధి పోయి తిరిగి సొంతూరికి చేరి.. కుటుంబాన్ని పోషించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పల్సి గ్రామానికి చెందిన బెంద్రే పీరాజీ ఉపాధి నిమిత్తం లక్ష్మనచాందాకు వలస వెళ్లాడు. కొన్నేళ్ల నుంచి అక్కడ రజక వృత్తితో పాటు బట్టలు ఇస్త్రీ చేస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో లాక్‎డౌన్‎తో ఉపాధి కోల్పోయాడు. దీంతో కుటుంబంతో సహా స్వగ్రామానికి చేరుకున్నాడు. అక్కడ కూడా ఉపాధి లేక.., ఉన్న వ్యవసాయం ఊతమివ్వక ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన పీరాజీ గ్రామ పొలిమేరలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story