- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘మిస్సింగ్’పై నో యాక్షన్.. స్టేషన్‌లో ఫాదర్ సూసైడ్
by Anukaran |

X
దిశ, పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురు వారం రోజుల క్రితం నుంచి కనిపించడం లేదని.. తండ్రి స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, తన కూతురు (మైనర్ బాలిక) తప్పిపోయిందని ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో రోజూ స్టేషన్‌కి వెళ్లి తన కూతురు ఆచూకీ కోసం ఆరా తీసినా.. పోలీసుల విచారణలో పురోగతి లేదు. దీంతో సదరు పోలీసులు స్పందించడం లేదన్న మనస్థాపంలో స్టేషన్ పక్కనే ఉన్న ఫెర్టిలైజర్ షాపులో పురుగుల మందు తీసుకొని తాగేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు విడిచాడు. ఓ వైపు కూతురు మిస్సింగ్, మరోవైపు భర్త ఆత్మహత్యతో భార్య, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story