- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పిల్లలు లేరని భార్య హత్య.. భర్త ఆత్మహత్య
by Sumithra |

X
దిశ, రాజేంద్రనగర్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్నాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడ ఇంద్రపాలేనికి చెందిన తోలుం రమణ (40), భార్య రత్నకుమారి (35)తో మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి నెక్నాపూర్‌లో అద్దెకు ఉంటున్నారు. 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగినా వీరికి సంతానం కలగలేదు. రమణ డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ మద్యానికి బానిసయ్యాడు. పిల్లలు కలుగలేదనే విషయమై భార్యతో అప్పుడప్పుడూ గొడవ పడుతుండేవాడు. మంగళవారం కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రమణ భార్యను హత్య చేసి, తాను కేబుల్ వైర్ తో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story