- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
69 రోజుల్లో మిలియనీర్‌గా మారిన యంగ్ యూట్యూబర్
దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో పెట్టుబడుల పరంగా అంతర్జాతీయంగా ఆసక్తిరేపిన అంశం ‘బిట్‌కాయిన్’. డిజిటల్ కరెన్సీలో భాగమైన ఈ క్రిప్టోకరెన్సీ విలువ అమాంతంగా పెరగడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో బిట్‌కాయిన్ ధరకు రెక్కలు రాగా.. దీంతో పాటు ఈథేరియం, పోల్కడాట్, లైట్‌కాయిన్, ‘డాగ్ కాయిన్’ తదితర క్రిప్టోకరెన్సీల విలువ కూడా పెరిగిపోయింది. అయితే వీటిలో డాగ్ కాయిన్‌కు క్రేజ్ తెచ్చింది మాత్రం ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్. మొదట తన ట్వీట్లతో బిట్ కాయిన్‌కు మద్ధతిచ్చి, దాని విలువ పెరిగేందుకు దోహదపడిన మస్క్.. డాగ్ కాయిన్ విషయంలోనూ అదే పనిచేశాడు. దాంతో ఎలన్ మస్క్ ఫాలోవర్ ఒకరు డాగ్ కాయిన్‌పై ఇన్వెస్ట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించాడు.
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ఎలన్ మస్క్.. ‘డాగ్ కాయిన్ ప్రజల క్రిప్టో’ అని ఫిబ్రవరిలో తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేశాడు. దీంతో ఈ క్రిప్టో కరెన్సీ ప్రజల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ట్రేడింగ్ యాప్ సర్వర్లు కూడా క్రాష్ అయిపోయేంతగా, తక్కువ వ్యవధిలోనే దీనికి ఫుల్ డిమాండ్ పెరిగింది. కాగా మస్క్ ట్వీట్‌తో ప్రేరణ పొందిన లాస్ ఏంజిల్స్‌కు చెందిన 33 ఏళ్ల గ్లౌబర్ కాంటెస్సోటో ‘డాగ్ కాయిన్’ క్రిప్టోకరెన్సీలో సుమారు 180,000 డాలర్లు (సుమారు రూ. 1.3 కోట్లు) పెట్టుబడి పెట్టి, ‘కేవలం 69 రోజుల్లో’ మిలియనీర్ అయిపోయాడు. కాంటెస్సోటో ఈ కరెన్సీ కొన్నప్పుడు దాని ధర సుమారు 0.045 సెంట్ (సుమారు రూ .3). అదే ఏప్రిల్ 16న దాని విలువ 0.45 డాలర్లతో ఆల్-టైమ్ గరిష్టానికి చేరుకుంది. దాంతో తన ప్రారంభ పెట్టుబడి దాదాపు 2 మిలియన్లకు (సుమారు రూ .15 కోట్లు) పెరిగిందని కాంటెస్సోటో చెప్పారు.
ఈ అమెరికన్ యూట్యూబర్.. తను డాగ్ కాయిన్‌లో ఎందుకు పెట్టుబడులు పెట్టాడో వివరిస్తూ తాజాగా ఓ వీడియో చేశాడు. ‘నేను ఫిబ్రవరి 5, 2021న 5 మిలియన్ల డాగ్‌కాయిన్స్ కొన్నాను. 69 రోజుల తర్వాత ఏప్రిల్ 15, 2021 నాటికి వాటి విలువ పెరగడంతో మిలియనీర్ అయ్యాను. @ProTheDoge అనే ట్విట్టర్ అకౌంట్‌లో నన్ను ఫాలో అవండి. నేను ఎందుకు వీటిని కొనుగోలు చేశానో తెలిపే టాప్ 5 కారణాలతో యూట్యూబ్ వీడియో చేశాను’ అని తన రెడిట్‌లో ట్వీట్ చేశాడు.
అయితే, ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు.. డిజిటల్ కరెన్సీలో కలిగే నష్టాలపై చర్చించారు. ఈ ఆస్తుల ధర పెరిగినంత త్వరగా పడిపోయే అవకాశాలుంటాయని హెచ్చరిస్తున్నారు.