కరీంనగర్‌లో దారుణం.. కనిపించకుండా పోయిన వ్యక్తి తగలబడుతూ..

by Sridhar Babu |   ( Updated:2021-09-13 01:50:35.0  )
కరీంనగర్‌లో దారుణం.. కనిపించకుండా పోయిన వ్యక్తి తగలబడుతూ..
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిసేటి సంతోష్ (39) అనే వ్యక్తిని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. సంతోష్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతుకుతూ సంతోష్ ఆచూకీ కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున కోరపల్లి – పాపయ్యపల్లి గ్రామాల మధ్య రోడ్డు పక్కన అతని ద్విచక్ర వాహనాన్ని గమనించిన కొందరు అటుగా వెళ్లి చూడగా సమీపంలో పొగలు రావడంతో దగ్గరకు వెళ్లి చూడగా సంతోష్ మృతదేహం తగల బడుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.



Next Story

Most Viewed