బీర్కుర్‌లో వ్యక్తి దారుణ హత్య.. చంపింది భార్య, పిల్లలేనా.. !

by Sumithra |
బీర్కుర్‌లో వ్యక్తి దారుణ హత్య.. చంపింది భార్య, పిల్లలేనా.. !
X

దిశ, బాన్సువాడ: ఆస్తి తగదాలతో ఓ వ్యక్తిని హత్యచేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కుర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బీర్కుర్ మండల కేంద్రానికి చెందిన నారం నారాయణ(50 బుధవారం రాత్రి ఆరుబయట పడుకొని ఉండగా.. భార్య, పిల్లలు కలిసి హత్య చేశారని చెబుతున్నారు. పొలం తగదాలతో గత మూడు రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Advertisement

Next Story