అర్ధరాత్రి సైకో వీరంగం.. వ్యక్తిపై దాడి

by Sumithra |
అర్ధరాత్రి సైకో వీరంగం.. వ్యక్తిపై దాడి
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఓ సైకో వీరంగం సృష్టించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భాషంపల్లి వీరస్వామి(38) అనే సైకో సోమవారం రాత్రి సమ్మయ్య అనే వ్యక్తిపై కర్రతో దాడి చేసి గాయపర్చాడు. దీంతో గ్రామస్తులు వీరస్వామిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. కాగా, నిందితుడు గతంలోనూ పలువురిపై దాడికి పాల్పడ్డాడని గ్రామస్తులు చెబుతున్నారు.

Tags: Psycho, attack, medak, crime news, ts

Advertisement

Next Story

Most Viewed