- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్ సీఎం మార్ఫింగ్ వీడియో.. యువకుడు అరెస్టు
గాంధీనగర్ : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మార్ఫింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో షేర్ చేసిన ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సూరత్ లోని సింగనాపూర్‌కు చెందిన అరవింద్ రూపానీ అనే యువకుడు.. అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ పాడిన ‘ఐ న్యూ యువర్ ట్రబుల్’ (i knew you were trouble) పాటకు సీఎం ముఖాన్ని అతికించి మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేశాడు. కరోనా పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆ వీడియోను తయారుచేసిన అరవింద్.. దానిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా వైరలైంది. దీనిపై పలువురు బీజేపీ కార్యకర్తల నుంచి పిర్యాదులు అందుకున్న సైబర్ పోలీసులు.. అరవింద్‌ను అరెస్టు చేశారు. ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి సమాజంలో అశాంతిని రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.