పిల్లలు పుట్టడం లేదని విగ్రహం అంగాన్ని దొంగిలించి..

by  |
పిల్లలు పుట్టడం లేదని విగ్రహం అంగాన్ని దొంగిలించి..
X

దిశ, వెబ్‌డెస్క్: పూజ చేసుకునేందుకు అంగం చోరీ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. అయితే ఆ అంగం విగ్రహానికి సంబంధించనది కావడం ఇక్కడ ట్విస్ట్. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 19న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులోని కాలబైరవ స్వామి విగ్రహం ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి గోస్పాడు మండలం ఒంటవెలగల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా… పోలీసులకే దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. కేసులో నిందితుడిని సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టి ఎస్పీ ఫకీరప్ప వివరాలను వెల్లడించాడు.

ఈనెల 19న కాల బైరవ స్వామి ఆలయ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిన యువకుడు స్వామికి పూజలు చేశాడు. అనంతరం కాలబైరవ విగ్రహ అంగం ధ్వంసం చేసి అందులో కొంతభాగం ఇంటికి తీసుకెళ్లాడు. ప్రతిరోజు అంగానికి పూజలు చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేశావని పోలీసులు ప్రశ్నించగా.. కాల భైరవ విగ్రహ అంగానికి పూజలు చేస్తే పిల్లలు పుడతారని చెప్పడంతో విగ్రహ అంగాన్ని అపహరించినట్లు చెప్పాడు. అయితే కొంతకాలం క్రితం యువకుడికి మ్యారేజ్‌ కాగా పిల్లలు పుట్టడం లేదు. ఈ క్రమంలోనే తెలిసిన వారు సలహా ఇవ్వడంతో చోరీ చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇందులో ఎలాంటిరాజకీయ ప్రమేయం లేదని, చోరీ చేసిన వ్యక్తి సాధారణ వ్యక్తేనని ఎస్పీ తెలిపాడు. నిందితుడు వాడిన పూలమాల, బైక్ ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.


Next Story