త్వరలో ‘మమతా కులకర్ణి’ బయోపిక్

by Shyam |   ( Updated:2020-07-18 01:09:30.0  )
త్వరలో ‘మమతా కులకర్ణి’ బయోపిక్
X

90వ దశకం బాలీవుడ్ సూపర్ సెన్సేషన్ ‘మమతా కులకర్ణి’ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆశిక్ ఆవారా, కరణ్ అర్జున్, సబ్ సే బడా కిలాడి లాంటి చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో తనదైన ముద్రవేసిన మమతా కులకర్ణి.. ఆ తర్వాత విక్రమ్ గోస్వామిని పెళ్లి చేసుకుని నైబోరాలో సెటిల్ అయిపోయింది. కాగా, 2016లో డ్రగ్ రాకెట్ కేసులో భర్తతో పాటు తనను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

బాలీవుడ్ గ్లామర్ క్వీన్‌గా వెలుగొందిన మమతా కులకర్ణి.. దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్‌గా ఎప్పుడూ హెడ్ లైన్స్‌లో నిలిచేది. హీరోయిన్‌గా మొదలై దావూద్ గ్యాంగ్‌తో సంబంధాలు, ఇల్లీగల్ బిజినెస్ వరకు సాగిన తన జీవన ప్రయాణాన్ని ‘ది స్టార్ డస్ట్ ఎఫైర్’ పుస్తకంలో పొందుపరిచారు బిలాల్ సిద్ధిఖీ. ప్రస్తుతం ఈ పుస్తకం ఆధారంగా సినిమా తీసేందుకు నిర్మాత నిఖిల్ ద్వివేది సిద్ధమయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడగా.. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తవనుందని తెలుస్తోంది. ఆ తర్వాత మమతా కులకర్ణి పాత్రలో నటించబోయే లేడీ సూపర్ స్టార్ గురించి వెల్లడిస్తారని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed