- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎన్నికల నాటికి మమత ఒక్కరే మిగులుతారు: అమిత్ షా
by Shamantha N |

X
దిశ,వెబ్ డెస్క్: ఎన్నికల నాటికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమత ఒక్కరే మిగులు తారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ మిడ్నాపూర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సమావేశానికి శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. తృణముల్ కాంగ్రెస్ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, మాజీ ఎంపీలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ కేంద్ర మంత్రి సువేందు అధికారి కూడా అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో 200కు పైగా స్థానాలను గెలుస్తామని అన్నారు. తమకు ఒకసారి అధికారం ఇస్తే సోనార్ బంగ్లా సాకారం చేస్తామని చెప్పారు. మమత సర్కారు హింసను ఎంత ప్రేరేపిస్తే బీజేపీ అంతగా బలపడుతుందని అన్నారు.
Next Story