- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నందిగ్రామ్ కౌంటింగ్‌పై దీదీ సంచలన వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ మెజార్టీతో గెలిచినా.. నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ ఓటమి పాలవ్వడం రచ్చకు దారితీసింది. ముందు మమత గెలిచినట్లు ప్రకటించిన ఈసీ.. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి విజయం సాధించినట్లు తెలపడం వివాదాస్పదంగా మారింది. నందిగ్రామ్ కౌంటింగ్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పిన మమత.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను గెలిచానని తెలిసి గవర్నర్ కూడా అభినందించారని దీదీ చెప్పారు. రీకౌంటింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని ఆర్‌వోను కొంతమంది బెదిరించినట్లు తన దృష్టికి వచ్చిందని, రీకౌంటింగ్ నిర్వహిస్తే ప్రాణాపాయం ఉందని ఆర్‌వో అన్నట్లు తనకు తెలిసిందని మమత చెప్పారు.
Next Story