పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

by Aamani |

దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో.. లక్ష్మీనర్సింహాస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సరకులను పంపిణీ చేసేందుకు దాతలు ముందుకురావడం అభినందనీయమన్నారు. మరింత మంది దాతలు ముందుకొచ్చి పేదలను ఈ విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Tags: mallareddy, Distribution, essential commodities, poor people, medchal



Next Story