ఆ రిజ్వర్వాయర్ తూము లీక్… నీట మునిగిన పంట

దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో నిర్మాణంలో ఉన్న మల్కపేట రిజర్వాయర్ తూము లీక్ అయి, పెద్ద ఎత్తున నీరు బయటకు రావడంతో పంటలన్నీ మునిగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్కపేట చెరువును రిజర్వాయర్‌గా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. అయితే అది ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ప్రాజెక్టు తూమును మట్టితో పూడ్చినప్పటికీ నీటి ధాటికి మట్టి కొట్టుకపోయింది.

దీంతో నీరు పంటపొలాలకు వచ్చి చేరింది. దీంతో సుమారు 50 ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు తెలిపారు. రాత్రి వేలల్లో నీరు లీక్ కావడంతో పొలాలను కాపాడుకోలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాంట్రాక్టర్ తూములో మట్టిని పకడ్భందీగా నింపించినట్టయితే లీక్ కాకపోయేదని అన్నారు.

Advertisement