షాహిద్‌తో మాళవిక వెబ్ సిరీస్

by Shyam |
షాహిద్‌తో మాళవిక వెబ్ సిరీస్
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ స్టార్ మాళవిక మోహనన్ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ పక్కన చాన్స్ కొట్టేసింది. ఫిల్మ్ మేకర్స్ రాజ్ అండ్ డీకే నెక్స్ట్ వెబ్ సిరీస్‌లో ఫీమేల్ లీడ్‌గా ఫైనలైజ్ అయిన భామ.. మార్చి చివరి వారంలో లేక ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో షూటింగ్‌లో పాల్గొననుంది. ఇళయ దళపతి విజయ్‌తో చేసిన ‘మాస్టర్’ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న మాళవిక.. తమిళ్ సూపర్‌స్టార్ ధనుష్ 42వ చిత్రంలోనూ అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా రాజ్ అండ్ డీకే ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉండగా.. మాళవిక, షాహిద్ చేయబోతున్న సిరీస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని సమాచారం.

షాహిద్ కపూర్ అమెజాన్ ప్రైమ్‌తో రూ. 60 కోట్ల ప్రాజెక్ట్‌కు సైన్ చేయగా.. ఇందులో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటి. ఇక తెలుగు సినిమా ‘జెర్సీ’ రీమేక్ చేస్తున్న షాహిద్.. నవంబర్ 9 నుంచి చంఢీగడ్‌లో నెక్స్ట్ షెడ్యూ్ల్‌లో జాయిన్ కాబోతున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే.. సిరీస్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు.

Advertisement

Next Story