మ్యాగజైన్‌తో మాళవిక అనుబంధం..

దిశ, వెబ్‌డెస్క్: మల్లు బ్యూటీ మాళవిక మోహనన్ షార్ట్ టైమ్‌లోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. సిజ్లింగ్ గ్లామర్, అమేజింగ్ యాక్టింగ్ స్కిల్స్‌తో మాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, శాండల్‌వుడ్‌లోనూ బిజీ అయిపోయింది. ముఖ్యంగా ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో క్రేజీ చాన్స్ కొట్టేసి తమిళనాట మోస్ట్ క్రేజీయెస్ట్ పర్సన్‌గా మారిన భామ.. వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. డిజైనర్స్‌కు పర్‌ఫెక్ట్ మోడల్‌గా.. ఫొటోగ్రాఫర్స్‌కు పర్‌ఫెక్ట్ బ్యూటీగా ఉన్న మాళవిక.. పలు మ్యాగజైన్స్ కవర్ పేజీలపై దర్శనమిస్తూ తన హవా చూపిస్తోంది.

ఈ క్రమంలోనే ‘గృహలక్ష్మి’ కవర్ పేజీపై కనిపించిన మాళవిక.. 41 ఏళ్ల మలయాళ మ్యాగజైన్ కవర్ పేజీపై తనను తాను చూసుకోవడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపింది. తను ఎదిగే క్రమంలో అమ్మ, నానమ్మ, అత్తమ్మలతో పాటు కుటుంబం మొత్తం కూడా ఈ మ్యాగజైన్ చదువుతూ ఉండేవారని తెలిపింది. అవి చూస్తూ పెరిగిన తాను అదే మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించడం.. అదే మ్యాగజైన్‌ను కుటుంబ సభ్యులు చదవడం అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. తన సంస్కృతి, బాల్య స్మృతులతో అనుబంధం ఉన్న ‘గృహలక్ష్మి’ మ్యాగజైన్‌లో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి షేర్ చేసుకుంది మాళవిక. అంతేకాదు, విజయ్‌తో మాస్టర్ మూవీ షూటింగ్ గురించిన విషయాలను కూడా వెల్లడించింది.

https://www.instagram.com/p/CFMZV4eAvFT/?igshid=1mzet09iirw1q

Advertisement