- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలుగులోనూ హర్భజన్.. భల్లే.. భల్లే!

దిశ, సినిమా: క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఫ్రెండ్‌షిప్’. సింగ్ అండ్ కింగ్ క్యాప్షన్‌తో వస్తున్న సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ మరో లీడ్ రోల్ ప్లే చేస్తుండగా.. జాన్ పాల్ రాజ్ – శ్యామ్ సూర్య దర్శకులు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌పై నిర్మాత ఏఎన్ బాలాజీ నిర్మిస్తున్న చిత్రాన్ని తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోయంబత్తూర్, ఊటీలో సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇందుకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు నిర్మాత. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే చాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
క్రికెటర్‌గా తానేంటో ప్రూవ్ చేసుకున్న హర్బజన్ సింగ్ నటుడిగానూ ఆకట్టుకోబోతున్నారని తెలిపారు. స్టేడియంలో బ్యాట్, బాల్‌తో ఆడుకున్న భజ్జీ.. తెరపై కూడా అంతే ఈజ్‌తో ఆడుకోబోతున్నట్లు చెప్పారు. వరల్డ్ వైడ్‌గా అంత పాపులారిటీ ఉన్నా సరే, డౌన్ టు ఎర్త్ ఉండటం అతనికే చెల్లుతుందన్నారు. లోస్లియా హీరోయిన్‌గా నటిస్తున్న ‘ఫ్రెండ్‌షిప్’ సినిమాలో తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి మాటలు అందిస్తున్న సినిమాకు డీఎం ఉదయ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.