భారత్ ​బంద్​ను జయప్రదం చేయండి

by srinivas |
భారత్ ​బంద్​ను జయప్రదం చేయండి
X

దిశ, ఏపీ బ్యూరో: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ 8న చేపడుతున్న భారత్ బంద్‌ను విజయవంత చేయాలని ఆఖిల భారత్ రైతు పోరాట సమన్వయ కమిటీ ఏపీ చైర్మన్ వడ్డేశోభనాధ్రీశ్వరరావు పిలుపునిచ్చారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ బంద్​కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు బంద్‌లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story