- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొంపల్లిని నెంబర్ వన్‌గా మారుస్తా : ఎమ్మెల్యే వివేకానంద
by Shyam |
X
దిశ, కుత్బుల్లాపూర్: కొంపల్లి మున్సిపాలిటీని అభివృద్ధిలో రాష్ట్రంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కొంపల్లి మున్సిపల్ పరిధిలో జరిగిన పనులతో పాటు చేబట్టబోయే పనులపై ఆయన మంగళవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొంపల్లి వాసులు చాలా రోజులుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు చేయించారన్నారు. ఆ నిధులతోనే పనులు చేపట్టామన్నారు. మౌళిక వసతులు ప్రధాన్యతనిస్తూ ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, కమిషనర్ రఘు, కౌన్సిలర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story