- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ
by Sumithra |

X
దిశ, రంగారెడ్డి: జిల్లాలో భారీ చోరీ జరిగింది. మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లోని సాయికుమార్ అనే వ్యక్తి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం సాయికుమార్ దంపతులు ఆస్పత్రికి వెళ్లగా ఆమె తల్లి లక్ష్మీ ఇంటి ముందు ఇస్త్రీ చేస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి 20 తులాల బంగారం రూ.1.80లక్షల నగదును ఎత్తుకెళ్లారు. కాసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లిన లక్ష్మి వస్తువులన్నీ చిందరవందరగా పడటం చూసి అనుమానం వచ్చి బీరువా దగ్గరికి వెళ్లి చూడగా చోరీ జరిగిన విషయం తెలుసుకుంది. వెంటనే సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story