'మేజర్'లో బాలీవుడ్ బ్యూటీ

by Shyam |
మేజర్లో బాలీవుడ్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: అడివి శేషు హీరోగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. శశి కిరణ్ డైరెక్షన్‌లో వస్తున్న మూవీని హీరో మహేశ్ బాబు, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనీ పిక్చర్స్ రిలీజింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో ఇప్పటికే శోభిత ధూళిపాళ జాయిన్ కాగా.. కొత్తగా మరో హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించింది మూవీ యూనిట్.

‘దబాంగ్ 3’లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో జతకట్టిన యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్‌కు వెల్ కమ్ చెప్తూ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఇంటెన్సిటీ, ఇన్నోసెన్స్ కలిగిన అమేజింగ్ రోల్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న ఈ భామ.. యంగ్ టాలెంట్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. కాగా గతేడాది అక్టోబర్‌లో సాయి మంజ్రేకర్ మేజర్ టీమ్ తో జాయిన్ అయినట్లు చెప్పింది మూవీ యూనిట్.

ఇక ఈ సినిమాకు అబ్బూరి రవి.. డైలాగ్ రైటర్ కాగా, కాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ ఇవ్వనుంది మేజర్ టీమ్. కాగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story