Mynampally : వచ్చే ఎన్నికల్లో అక్కడినుంచే పోటీ చేస్తా..క్లారిటీ

by Javid Pasha |   ( Updated:2023-09-23 09:36:25.0  )
Mynampally : వచ్చే ఎన్నికల్లో అక్కడినుంచే పోటీ చేస్తా..క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. శుక్రవారం బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన.. నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దీంతో ఆయన ఇంటి వద్దకు భారీగా కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. మైనంపల్లికి అనుకూలంగా నినాదాలు చేస్తుండటంతో.. ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. నేడు మైనంపల్లితో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా హస్తం గూటికి చేరనున్నారు.

అయితే మైనంపల్లికి కుత్బుల్లాపూర్ లేదా మేడ్చల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా మైనంపల్లి స్పందించారు. తాను మల్కాజ్‌గిరి నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్, మేడ్చల్ నుంచి పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. కొంతమంది కావాలనే సోషల్ మీడియాలో అతస్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కార్యకర్తలు ఇంటి వద్దకు భారీగా తరలిరావడంతో వారిని కలిసేందుకు మైనంపల్లి బయటకొచ్చారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. తనకు పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తలు ముఖ్యమని మైనంపల్లి తెలిపారు. కార్యకర్తల కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్దమని ప్రకటించారు. తనకు మద్దతు తెలిపే కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మైనంపల్లి విమర్శించారు.



Next Story

Most Viewed

    null