- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహీంద్రా గ్రూప్ మరో ముందడుగు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19పై పోరాటానికి దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా గ్రూప్ ఇదివరకూ అతి తక్కువ ధరకే వెంటిలేటర్లను అందిస్తామని ప్రకటించింది. తాజాగా మరో ముందడుగు వేసి మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన వైద్య రంగంలోని వారి రక్షణ కోసం సిద్ధమైంది. మహీంద్రా వాహనాల్లో ఉపయోగించే విండ్ షీల్డ్‌లను తయారుచేసే పదార్థాన్ని వాడి ఫేస్ షీల్డ్, మాస్కులను, ఆస్పిషన్ బాక్సులను తయారుచేయాలని నిర్ణయించుకుంది. విండ్ షీల్డ్‌లలో వాడే పాలికార్బొనేట్ పదార్థంతో బాక్సులను తయారు చేస్తామని సంస్థ పేర్కొంది. దీనివల్ల కరోనా సోకిన రోగికి పెట్టిన ఇంట్యూబేషన్‌ను తీస్తున్నప్పుడు, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి వైరస్ రాకుండా ఉండేందుకు రక్షణగా నిలుస్తుంది.
ఈ పరికరాలను అమెరికాలోని సౌత్‌వెస్ట్ మిచిగాన్‌లో ఉన్న మహీంద్రా ప్లాంట్‌లో తయారు చేసేందుకు సిద్ధమైంది. సరికొత్త పద్ధతిలో వీటిని తయారు చేస్తామని, దీనికోసం మిచిగాన్‌లో ఉన్న ఫోర్డ్ మోటార్స్, జనరల్ మోటార్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని గ్రూప్ ఆటోమోటివ్ సీఈవో రిక్ వివరించారు. వీటి తయారీలో వాడే పదార్థం కఠినమైన పదార్థం అయినందున ప్లాస్టిక్ లాగా కాకుండా సురక్షితంగా ఈ పరికరాలు ఉంటాయని ఆయన చెప్పారు. వీటి ఉత్పత్తికి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగిందని, వీటి డిజైన్లను ఇండియాలోనూ తయారీ కోసం పంపించామని రిక్ వెల్లడించారు.
Tags: mahindra group, coronavirus, covid-19, ppe