- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్లపై భారీ తగ్గింపు .. మహీంద్రా
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల కంపెనీ మహీంద్రా ఫెస్టివల్స్‌ను పురస్కరించుకొని ఈ వింటర్ సీజన్‌లో కార్ల పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఒక్కో మోడల్‌పై ఒక్కో రకంగా ధరల తగ్గింపు ఆఫర్‌లను తెచ్చింది. ఈ ఆఫర్‌లను వాడుకోని వింటర్ సీజన్‌లో కొత్త కారును కొనుక్కొని మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. మరి ఏ కార్లపై ఎంత తగ్గింపు ఉందో చూద్దాం.
మహీంద్రా XUV300: మొత్తం క్యాష్‌లో రూ.30,000 వరకు తగ్గింపు, ఎక్స్‌చేంజ్ ద్వారా రూ.25,000 వరకు తగ్గింపు. కార్పొరేట్ ఆఫర్ రూ.4000. కంపెనీ రూ.10,000 ఖరీదు చేసే ఇతర ఆఫర్‌లు అందిస్తోంది. అంటే ఈ కారుపై మొత్తం రూ.69,000 తగ్గింపు పొందవచ్చు. దీని ధర రూ. 8.89 లక్షల నుంచి రూ.15 లక్షలు.
మహీంద్రా బొలెరో: ఈ కారు పై మొత్తం రూ.13,000 ప్రయోజనాలు పొందవచ్చు. దీనిలో రూ.3,000 వరకు కార్పొరేట్ ఆఫర్, రూ.10,000 వరకు ఎక్స్‌చేంజ్ తగ్గింపు ఉంది. బొలెరో SUV పై ఎటువంటి నగదు తగ్గింపులు లేవు. మహీంద్రా బొలెరో ధర రూ.10 లక్షల వరకు ఉంది.
మహీంద్రా స్కార్పియో: మహీంద్రా స్కార్పియో రూ.34,000 తగ్గింపు ఉంటుంది. ఇందులో రూ.4,000 వరకు కార్పొరేట్ ఆఫర్. రూ.15,000 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంది. ఇతర ఆఫర్‌లు ద్వారా రూ.15,000 ప్రయోజనాలు ఉన్నాయి. దీని ధర రూ.17 లక్షల వరకు ఉంటుంది.
మహీంద్రా మరాజ్జో: ఈ కారు పై రూ.40,200 వరకు తగ్గింపును పొందవచ్చు. క్యాష్ తగ్గింపు ద్వారా రూ.20,000. ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.15,000. కార్పొరేట్ ప్రయోజనం రూ.5200 వరకు ఉంటుంది. దీని ధర రూ.13 లక్షల వరకు ఉంది.