- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన మహీంద్రా అండ్ మహీంద్రా!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా భారీగా ఎగ్జిక్యూటివ్‌లను తొలగించింది. కరోనా వల్ల సంస్థ సంక్షోభాన్ని చూస్తోందని, దేశీయంగా అమ్మకాల స్థాయి బలహీనంగా ఉండటంతో 300 మంది మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించినట్టు సమాచారం. ఉద్వాసన పలికిన వారిలో మహీంద్రా మొబిలిటీ సర్వీసెస్ ప్రెసిడెంట్, మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బొర్డ్ సభ్యుడిగా ఉన్న వీఎస్ పార్థసారధి కూడా ఉన్నారు. అలాగే, పలువురు సీనియర్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నట్టు తెలుస్తోంది.
సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆటో విక్రయాల్లో 28 శాతం మేర క్షీణత నమోదైంది. అంతేకాకుండా పరిశ్రమ పరిమాణం 13 శాతానికిపైగా తగ్గింది. ఈ కారణంగానే కంపెనీ భారీ స్థాయిలో తొలగింపులను చేపట్టినట్టు సమాచారం. కరోనా సంక్షోభాన్ని, తదనంతర సవాళ్లను అధిగమించేందుకు పునర్నిర్మాణ చర్యలో భాగంగానే ఆటో, వ్యవసాయ విభాగానికి చెందిన తొలగింపులు చేపట్టినట్టు, త్వరలో మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో కూడా తొలగింపులు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
‘సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా భవిష్యత్తులో అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. అధిక ఉత్పాదకత, వేగవంతమైన వృద్ధి కోసం సంస్థను సరళీకృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎంఅండ్ఎం ఆటోమోటివ్ అండ్ ఫార్మ్ సెక్టార్ హెచ్ఆర్ రాజేశ్వర్ త్రిపాఠి చెప్పారు.