ఈరోజు తనకెంతో ప్రత్యేకమంటున్న మహేష్

by  |
ఈరోజు తనకెంతో ప్రత్యేకమంటున్న మహేష్
X

దిశ వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన అప్ డేట్స్ అన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటాడు. అయితే ఈ రోజు తనకు ఎంతో స్పెషల్ డే అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. ఆ ట్వీట్ కు తల్లితో దిగిన ఫోటోను కూడా జతచేశారు. మహేష్ కు ఏప్రిల్ 20 ఎందుకంత స్పెషల్ డే అని అనుకుంటున్నారా? ప్రిన్స్ మహేష్ తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు ఇవాళే. ఈ సందర్భంగానే తన తల్లికి ట్విటర్ లో శుభాకాంక్షలు తెలిపాడు మహేష్.

“ఏప్రిల్ 20 నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈ రోజు మా అమ్మపుట్టిన రోజు. హ్యాపీ బర్త్ డే అమ్మా” అంటూ ఇందిరా దేవి, మహేష్ బాబు కలిసున్న ఫొటోను మహేష్ బాబు షేర్ చేశారు. కాగా మహేష్ సోదరి మంజులా కూడా ట్విట్టర్ లో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తను ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. తన నవ్వులానే .. తన వ్యక్తిత్వం కూడా ఎంతో స్వచ్ఛమైనది. మా జీవితంలోని ప్రతి రోజును గొప్పగా తీర్చిదిద్దావు. మన కుటుంబానికి నువ్వే వెన్నుముక. లవ్ యూ అమ్మ. హ్యపీ బర్త్ డే అమ్మ’ అంటూ మంజులా ట్వీట్ చేసింది.


Tags : super star mahesh babu, krishna, indira devi, manjula, mb, twitter, wishes


Next Story