- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆరోగ్య సేతు అత్యవసరం : మహేశ్

దేశంలో లాక్‌డౌన్ సడలింపులతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే భారత్‌లో ఐదు లక్షలకు మించి పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. అడుగు అడుగునా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
View this post on InstagramA post shared by Mahesh Babu (@urstrulymahesh) on
లాక్‌డౌన్ ఎత్తేయడంతో కరోనా విజృంభిస్తోందన్న మహేశ్.. మనల్ని, మన చుట్టూఉన్న వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని.. తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. ప్రభుత్వ నిబంధనలు అనుసరించాలని కోరారు. ఇప్పటికీ ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే చేసేయమన్న మహేశ్.. ఈ యాప్ మీ చుట్టుపక్కల పాజిటివ్ కేసులు ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, అత్యవసర సేవలు పొందడం సులువవుతుందన్న మహేశ్.. సురక్షితంగా, బాధ్యతగా ఉండాలని కోరారు.
కాగా మహేశ్.. త్వరలోనే ‘సర్కార్ వారి పాట’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా.. నభా నటేశ్ సెకండ్ ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది.