నాని.. నా హృదయం ఉప్పొంగింది : Mahesh Babu

by Shyam |   ( Updated:2021-06-20 03:19:33.0  )
నాని.. నా హృదయం ఉప్పొంగింది : Mahesh Babu
X

దిశ, సినిమా : పాండమిక్ టైమ్‌లో నిస్వార్థంగా సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్స్, హెల్త్ అఫీషియల్స్‌కు నివాళి అర్పించేందుకు నేచురల్ స్టార్ నాని స్పెషల్ మ్యూజిక్ వీడియో రూపొందించాడు. ‘చాయ్ బిస్కెట్’ టీమ్‌తో కలిసి ‘దారే లేదా’ పేరుతో రిలీజ్ చేసిన వీడియోకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ మూవీలో లీడ్ యాక్టర్స్‌ చేసిన సత్యదేవ్, రూప కొడువయూర్ డాక్టర్లుగా కనిపించిన వీడియో ఇప్పటికే ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఈ ట్రిబ్యూట్ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుండగా.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు అందమైన రీతిలో నివాళులు అర్పించారన్న మహేశ్ (Mahesh Babu).. వీడియో చూశాక తన హృదయం ఉప్పొంగిందని తెలిపారు. ఈ సందర్భంగా నానితో పాటు చాయ్ బిస్కెట్ టీమ్‌ వర్క్‌‌ను మెచ్చుకున్నారు. కాగా మహేశ్ ట్వీట్‌కు స్పందించిన నాని.. ‘థాంక్యూ సర్, ఈ పాటను ఎంతో మంది హృదయాలకు దగ్గర చేయడంలో మీ విలువైన మాటలు సాయపడతాయి. మేము ఇంకా ఎక్కువ అడగలేం’ అంటూ పోస్టు చేశాడు.

Advertisement

Next Story