నువ్వా నేనా.. మహేశ్‌తో గౌతమ్ పోటీ ?

by  |
నువ్వా నేనా.. మహేశ్‌తో గౌతమ్ పోటీ ?
X

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు లాక్‌డౌన్ డైరీస్ సూపర్ ఫన్నీగా గడుస్తున్నాయి. కూతురు సితార, కొడుకు గౌతమ్ ఘట్టమనేనితో ఆడుతూ పాడుతూ సూపర్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. రోజుకో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఆకట్టుకుంటున్న మహేశ్ అండ్ ఫ్యామిలీ.. నెటిజన్లకు సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. సితార పాప ముద్దు ముద్దు మాటలు, పాటలు.. తండ్రికి మసాజ్ చేయడం నుంచి గౌతమ్ తండ్రితో గేమ్స్ ఆడి ఓడిపోవడం వరకు అన్ని వీడియోలు ఫ్యాన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చాయి.

https://www.instagram.com/p/CAf_CuCHQFm/?utm_source=ig_web_copy_link

ఇక తాజాగా మహేశ్.. గౌతమ్‌తో హైట్ చెక్ చేసుకుంటున్న వీడియో ఒకటి షేర్ చేశాడు. ఆరడుగుల ఎత్తున్న తండ్రి హైట్‌కు పోటీనిచ్చిన గౌతమ్ స్మైల్.. ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలిచింది. ‘హైట్ చెక్ .. హి ఈజ్ టాల్’ అని మహేశ్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇవ్వగా.. ఇందులో మహేశ్ లుక్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియోపై స్పందించిన మహేశ్ సోదరి మంజుల.. అవును ‘గౌతమ్ నీకన్నా పొడుగు.. 13 ఏళ్ల వయసులో నువు ఆ దరిదాపుల్లో కూడా లేవని’ అంది.

కాగా మహేష్ నెక్స్ట్ సినిమా పరశురామ్ దర్శకత్వంలో ఉండగా.. హీరోయిన్‌గా కియారా అద్వానీ ఫైనల్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తుండగా మే 31న దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.


Next Story

Most Viewed