10 మిలియన్ థ్యాంక్స్ : మహేశ్

by  |
10 మిలియన్ థ్యాంక్స్ : మహేశ్
X

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రిన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందని తెలుసు కానీ.. సోషల్ మీడియాలో మరీ ఇంత భారీ ఫాలోయింగ్ రావడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ట్విట్టర్‌లో ఏకంగా 10 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన మహేశ్.. 9.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ధనుష్ రికార్డ్‌ను అధిగమించారు.

ట్విట్టర్‌లో ఏకంగా కోటి ఫాలోవర్స్ రికార్డ్‌పై సంతోషం వ్యక్తం చేసిన మహేశ్ బాబు.. 10 మిలియన్ల బలాన్ని ఇచ్చారన్నారు. ఈ కృతజ్ఞతాభావాన్ని తెలిపేందుకు 10 మిలియన్ థ్యాంక్స్ సరిపోవన్నారు. అభిమానులతో వర్చువల్‌గా కనెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రేమతో అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

https://twitter.com/urstrulyMahesh/status/1278999280208867329?s=20


Next Story

Most Viewed