- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోని.. ఈ పేరును మరిచారా.. మళ్లీ వస్తున్నాడు..!
దిశ, వెబ్‌డెస్క్: మహేంద్ర సింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్‌లోనే కూలిస్ట్ కెప్టెన్‌గా పేరుగాంచిన ఆటగాడు. భారత జట్టు మాజీ కెప్టెన్. నిశ్శబ్దంగా ఉంటూనే టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు తెచ్చి పెట్టిన ఘనత ధోని సొంతం. అతి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టుకు అండగా ఉండి ఎన్నో విజయాలను తెచ్చిపెట్టాడు. కొన్ని పరాజయాలకు కూడా కారణమయ్యాడు. ఎన్నో ప్రశంసలతో పాటు విమర్శలను సైతం స్వాగతించిన ఏకైక ఆటగాడు.
విమర్శలకు తన ఆటతోనే సమాధానం చెప్పి.. క్రికెట్ చరిత్రలో చెదరని ముద్ర వేసిన మహేంద్రుడు.. అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రం సైలెంట్‌గా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఐపీఎల్2020లో దర్శనమిచ్చిన అతడు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెరమీదకు రాలేదు. దీంతో ధోని పేరు ఎక్కడా కనిపించడం కానీ, వినిపించడం కానీ జరగలేదు. కానీ, ఐపీఎల్2021తో ధోని మళ్లీ వస్తున్నాడని అభిమానులు పండుగ జేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఇండియా తరఫున జట్టులో ఆడుతున్న సమయంలో నిత్యం వార్తల్లో నిలిచే ధోని ప్రస్తుతం అంతగా కనబడక పోవడం గమనార్హం. అసలు ధోని రిటైర్‌మెంట్ రోజు నుంచి ఇప్పటివరకు ఏమైంది.. అసలు కారణాలు తెలియాలంటే రీడ్ దిస్ స్టోరి.
కూల్‌గానే చెప్పాడు..!
2020 ఆగస్టు 15న లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. 74వ స్వాతంత్ర్య వేడుకలను నిబంధనలతో జరుపుకుంటున్న భారతీయులకు.. అదే రోజు సాయంత్రం ఓ ఇన్‌స్టా పోస్ట్ తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. అది ఏంటంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు తాను రిటైర్‌మెంట్ ప్రకటించినట్టు ధోని పోస్టు పెట్టాడు. అంతే, ఆ పోస్టు నెట్టింట్లో బౌండరీకెళ్లిన బంతికంటే వేగంగా చక్కర్లు కొట్టింది. కూలెస్ట్ కెప్టెన్ మరీ ఇంత కూల్‌గా రిటైర్‌మెంట్ ప్రకటించడం ఏంటని కన్నీళ్లు పెట్టుకున్నారు అభిమానులు. వీళ్లేకాదు.. ధోని వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ఆ మధ్య అందరూ ఆటగాళ్లు బహిరంగంగా చెప్పారు. ప్రత్యేకంగా ధోని కోసం వీడ్కోలు మ్యాచ్ పెట్టాలని కొందరూ.. రిటైర్‌మెంట్ అయిన ఆటగాళ్ల కోసం కూడా నిర్వహించాలని మరికొందరు బీసీసీఐని కోరారు. దానికి బీసీసీఐ సుముఖత వ్యక్తి చేసినప్పటికీ ధోని నుంచి సరైన సమాధానం రాలేదని క్రికెట్ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత ధోని ఇజ్ బ్యాక్ అంటూ 2020 ఐపీఎల్ సీజన్‌లో అడుగుపెట్టినా.. ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదని చెన్నై అభిమానులు నిరుత్సాహం చెందారు. చెన్నై సూపర్ కింగ్స్ చెత్త ప్రదర్శనతో అనేక చీవాట్లు తిన్నాడు. మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో ఏకంగా తన కూతురును టార్గెట్ చేసి ఓ నెటిజన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రతీ సారి ఫైనల్ వరకు వచ్చే ధోని సేన.. గతేడాది మాత్రం కనీసం ప్లే ఆఫ్స్ వరకు రాకుండా వెనుదిరిగింది. ఈ పరిణామాలతో ధోని అభిమానుల అంచనాలను తాకలేకపోయాడని విమర్శలు వచ్చాయి. ఇటువంటి సమయంలో ధోని అంతర్జాతీయ రిటైర్‌మెంట్ అనేది జనాలు సగం మర్చిపోయినంత పనైంది.
అంతే ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే ధోని ఇంటి బాట పట్టాడు. ఆ తర్వాత టీమిండియా ఆసీస్ టూర్‌లో బిజీ కావడంతో.. అభిమానుల ఫోకస్ మొత్తం ఆసీస్‌టూర్‌పై మళ్లింది. దీనికి తోడు యువ ఆటగాళ్లు చెలరేగడంతో టీమిండియా విదేశీ గడ్డపై విక్టరీ కొట్టి వచ్చింది.. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా టెస్టు సిరీస్‌లు ఆడుతుంది. దీంతో క్రీడా రంగం ప్రస్తుతం ఉన్న మ్యాచ్‌లపై ఫోకస్ చేయడంతో ధోని పేరును మరిచినట్టు అయింది. అయితే, ఆసీస్‌పై టీమిండియా విజయం తర్వాత కూడా ధోని స్పందన కరువైందని కామెంటేటర్లు చెబుతున్నారు. కనీసం సోషల్ మీడియాలో కూడా ధోని కనువిందు చేయకపోవడంతో అభిమానులు మరింత నిరుత్సాహానికి గురవుతున్నారు.
ధోని మళ్లీ వస్తున్నాడు…
నిజానికి చెప్పాలంటే గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ధోని కెప్టెన్సీపై తీవ్రంగా ప్రభావం చూపిందనే చెప్పాలి. కానీ, సీఎస్కే యాజమాన్యం మాత్రం ధోనిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడం లేదని తేగేసి చెబుతూనే.. 2021లో కూడా అతడినే కెప్టెన్సీగా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే ఐపీఎల్ సీజన్-14 స్వదేశంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఫ్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను విడుదల చేశాయి. అత్యధికంగా సీఎస్కే నుంచే ఆటగాళ్లు విడుదల అయ్యారు. కానీ, ధోనిని మాత్రం యాజమాన్యం అట్టిపెట్టుకుంది. మరి కొద్ది రోజుల్లోనే మినీ వేలం కూడా నిర్వహిస్తున్నారు. ఈ తతంగం ముగిసిన వెంటనే ఐపీఎల్-సీజన్ 14కు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. దీంతో ఐపీఎల్ ఆడటానికి మహేంద్రసింగ్ ధోని వస్తున్నాడు అంటూ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు దెబ్బతిన్న సింహం ఈ ఐపీఎల్‌లో ఎదురుదాడి చేస్తుందని నెట్టింట్లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.