థర్డ్ వేవ్‌కు సిద్ధమవుతున్న మహారాష్ట్ర

by Shamantha N |
థర్డ్ వేవ్‌కు సిద్ధమవుతున్న మహారాష్ట్ర
X

ముంబై: కరోనా వైరస్ ఫస్ట్, సెకండ్ వేవ్‌లు మహారాష్ట్రపై పంజా విసిరాయి. తొలి వేవ్‌లో అత్యధిక కేసులు మహారష్ట్ర నుంచే రిపోర్ట్ అయ్యాయి. సెకండ్ వేవ్‌లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. అందుకే మూడో వేవ్ కూడా మహారాష్ట్రలోనే ముందుగానే ప్రవేశించవచ్చునని, గత వేవ్‌లలాగే విరుచుకుపడవచ్చన్న విశ్లేషణలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వమూ థర్డ్ వేవ్‌పై స్పందించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అందుకు సంసిద్ధమవుతున్నది. తొలి వేవ్‌లో వయోధికులు బలవ్వగా, సెకండ్ వేవ్‌లో ఎక్కువగా యువత దీని బారినపడ్డారు. అయితే, థర్డ్ వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశముందన్న అధ్యయనాల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చైల్డ్ కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది.

థర్డ్ వేవ్ 18ఏళ్ల లోపువారికి ప్రమాదకారిగా మారనుందని, అందుకే చైల్డ్ కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్ట రాష్ట్రఆరోగ్యశాఖ రాజేశ్తోపె తెలిపారు. పిల్లలకు భిన్నమైన వెంటిలేటర్ బెడ్లు అవసరమవుతాయని, మెడికల్ ఎక్విప్‌మెంట్లూ ప్రత్యేకంగా ఉంటాయని అన్నారు. పిల్లల కోసం పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తామని వివరించారు. ఒక వేళ పిల్లాడికి పాజిటివ్ వస్తే ఒంటరిగా ఉండటం కుదరదని, వాళ్లతో తల్లి వెంట ఉండాల్సి వస్తుందని తెలిపారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చర్యలకు ఉపక్రమిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మనదేశంలో పిల్లల కోసం టీకాల్లేవు. కెనడా ప్రభుత్వం పిల్లల కోసం ఫైజర్ టీకాను అనుమతించింది. అమెరికా కూడా త్వరలో ఆమోదించే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story