సెలబ్రెటీల రేవ్ పార్టీ.. పట్టుబడిన బిగ్ బాస్ బ్యూటీ

by Anukaran |   ( Updated:2021-06-27 05:33:58.0  )
drugs party in maharastra
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో మరోసారి ప్రముఖల రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున ఇగాత్‌పురిలోని ఓ ప్రైవేట్ బంగ్లాలో జరుగుతున్నఈ పార్టీపై పోలీసులు రైడ్ చేశారు. పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేశారు. పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్టు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకన్నారు. ఈ ఘటనలో 10 మంది పురుషులు, 12 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రైడ్ లో భారీగా కొకైన్, ఇతర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకన్నారు.

అరెస్ట్ చేసిన 12 మంది మహిళల్లో.. ఆరుగురు వెబ్ సిరీస్‌ల్లో పనిచేసిన మోడల్స్, నటీమణులు, ఇద్దరు కొరియోగ్రాఫర్లు, ఒకరు ఇరానియన్ మూలాలు ఉన్న మోడల్, ఒకరు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వీరిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్ పార్టీ పేరుతో వ్యభిచారం ఏమైనా నిర్వహించారా..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story