సీపీఎస్ విధానంతో ఉద్యోగుల జీవితాలు వీధిపాలు..!

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: కేంద్రం తీసుకొచ్చిన సీపీఎస్ విధానంతో ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడుతున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. మంగళవారం నాడు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్లు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్‎నగర్ జిల్లాలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి తమ విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యనిర్వహణా బాధ్యతలు మోసే ఉద్యోగులను సంక్షేమంగా చూడడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ అనేది ఉద్యోగవర్గంపై ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత దాడిగా భావిస్తున్నామని.. కొత్త పెన్షన్ విధనాన్ని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

Advertisement