పాలమూరులో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షా 90 వేల జీతం

దిశ, వెబ్ డెస్క్: మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 16 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రొఫెసర్-4, అసోసియేట్ ప్రొఫెసర్-9, అసిస్టెంట్ ప్రొఫెసర్-2, ట్యూటర్-1 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నది. ప్రొఫెసర్ కు నెలకు రూ. లక్షా 90 వేలు, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ. లక్షా 50 వేలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ. లక్షా 25 వేలు, ట్యూటర్ కు రూ. 55 వేల జీతం ఇవ్వనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నేటి నుంచి ఈనెల 27 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూలై 2న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఇతర వివరాలకు సంబంధించి http://gmcmbnr-ts.org/ వెబ్ సైట్ ను సంప్రదించగలరని తెలిపింది.

Advertisement