కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి చూసే పరిస్థితి తేవొద్దు

by Shyam |
Mahabubabad Collector Shashanka
X

దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మైలారంతండాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శశాంక సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు గంటలు తరబడి వేచి ఉండేలా చేయొద్దని, త్వరగా కొనుగోలు చేసి పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అనంతరం తాహసీల్దార్ కార్యాలయంలో భూమి వివరాలను పరిశీలించారు.

అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్

కొత్తగూడ మండలంలో పర్యటించిన కలెక్టర్ శశాంక మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో హాస్టల్‌లోని సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఎలాంటి భవిష్యత్తు కోరుకుంటున్నారని కలెక్టర్ ప్రశ్నించగా, కొంతమంది కలెక్టర్ అవుతామని చెప్పగా, మరి కొందరు స్పందించలేదు. దీంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. జీవితంలో ఎదగాలంటే చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులు సైతం నిర్లక్ష్యాన్ని వీడి అంకిత భావంతో పనిచేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ చందా నరేష్, స్థానిక ఎస్ఐ నాగేశ్, ఎంపీడీఓ కరణ్ సింగ్, ఏఓ జక్కుల ఉదయ్, ఓడీసీఎమ్ఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కళ్యాణి, ఏఈఓలు హలవత్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story