ఇంద్రజాలికుడుకి ప్రశంసాపత్రం

by Shyam |
ఇంద్రజాలికుడుకి ప్రశంసాపత్రం
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు, వెంట్రిలాక్విజం కళాకారుడు వై.రమేష్ కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించినందుకు ప్రశంసాపత్రం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కళ ద్వారా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు ఆల్ ఇండియా మెజీషియన్ సొసైటీ ప్రశంసా పత్రం అందించిందని తెలిపారు. రమేష్ తన కళ ద్వారా స్వచ్ఛభారత్, ప్లాస్టిక్, పోలియో చుక్కలు, మూడనమ్మకాలు, తదితర అంశాలపైన ప్రదర్శనలిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. విశేషం. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్, బూర మల్లేశం, స్వామి, బాలకిషన్, నర్సింలు, శ్రీరామ్ శ్రీనివాస్ తదితరులు అభినందలు తెలిపారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed