నేను పేడలో పుట్టా.. నాకు కరోనా రాదు

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ వ్యాప్తి విస్తృతం అవుతూ విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు దీనికి వాక్సిన్ కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కరోనాపై కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. హాస్యాస్పదంగా ఉన్నాయి. వైరస్‌ను తేలికగా తీసుకుంటూ, దానికి విరుగుడు కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు.

తాజాగా.. మీకు కరోనా సోకిందటగా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మధ్యప్రదేశ్ మంత్రి ఇమార్తి దేవి గ్వాలియర్‌లో వింత సమాధానం ఇచ్చారు. నేను మట్టి, ఆవు పేడలో జన్మించాను. అక్కడ చాలా సూక్ష్మక్రిములున్నాయి. కరోనా నా దగ్గరికి కూడా రాదని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

https://twitter.com/OstwalKumarp/status/1301919537210638337?s=20

Advertisement