- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తాగుబోతు కేసీఆర్‌వి.. తుపాకీ రాముని మాటలే’
దిశ, యాదగిరిగుట్ట : టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఈ రోజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఫాంహౌస్ చుట్టూ ప్రాంతాల అభివృద్ధికే కృషి చేస్తోందే తప్ప.. రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలని కాదని మధు యాష్కీ అన్నారు. ఫాంహౌస్ చుట్టూ కేసీఆర్ బంధువుల భూములకు మార్గం సుగమనంగా ఉండాలనే, వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నారన్నారు. అందుకే ఆ గ్రామం మీదుగా 4లైన్ల రోడ్డు వేయడానికి మొట్టమొదట దళితబంధు అక్కడ ప్రారంభించారని ఆరోపించారు.
టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టింది రైతు బంధు పథకం కాదు.. అది రావుల బంధు పథకం అని, కేసీఆర్ తరచూ మాట్లాడే మాటలు తుపాకీ రాముని మాటలన్నారు. ఆనాడు ఎవరు మాట్లాడారో తెలియదు కానీ ఇప్పుడు ఈ తాగుబోతు సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నది మాత్రం తుపాకీ రాముని మాటలే, అందుకే గ్రామాల్లోని ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ మాటలు ఉంటాయని విమర్శించారు. అవి పనికొచ్చే మాటలు కాదని, నాటకాలు ఆడడానికి పనికొస్తాయన్నారు. నాటకం అయిపోయాక తుపాకీ రాముని వేషం ఇప్పుతాడని, అప్పుడు అంతా మళ్ళీ మొదటికే వస్తుందన్నారు. యాదాద్రి పునర్నిర్మాణం మొత్తం జూటా నిర్మాణమని, కట్టుడు కూలగొట్టుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయట పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్, ఆలేరు నియోజకవర్గ ఇంచార్జీ బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.