కేసీఆర్ అరాచక పాలనను అంతం చేస్తాం: మధుయాష్కీ

by Ramesh Goud |
కేసీఆర్ అరాచక పాలనను అంతం చేస్తాం: మధుయాష్కీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ చేతిలో తెలంగాణ ప్రజలు బందీ అయ్యారని, ఈ అరాచక నియంతృత్వ పాలనను అంతమొందిస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శనివారం జరిగిన ప్రెస్ మీట్‌లో మధుయాష్కీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, విద్య, ఉద్యోగాలు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చిందని.. కానీ, రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బంది అయ్యిందన్నారు. కేసీఆర్ నయా నిజాంగా వ్యవహరిస్తున్నారని వీటన్నింటినీ అంతమొందించేందుకే రేపు ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను నిర్వహిస్తున్నామని ఆయన గుర్తుచేశారు. దళితులకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా ఇప్పుడు ఉపఎన్నిక వచ్చేసరికి దళిత బంధు అని కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. దళితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి, ఉద్యోగాలు ఇచ్చి ఉంటే దళితబంధు అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం వారికి వచ్చే హక్కులు అమలు అయితే వారు ఆత్మగౌరవంతో ఉండేవారని తెలిపారు. దళిత గిరిజనుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చినా తక్కువే అన్నారు. ఇంద్రవెల్లి సభ‌కు రాజకీయాలకతీతంగా అందరూ తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed