- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పక్కా ఆధారాలతో కొల్లు రవీంద్ర అరెస్ట్: ఎస్పీ
దిశ, అమరావతి బ్యూరో: వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే కొల్లు రవీంద్రను అరెస్టు చేశామని మచిలీపట్టణం ఎస్పీ రవీంద్ర బాబు తెలిపారు. నిందితులు వాంగ్మూలం ఇచ్చిన తర్వాతే కొల్లును అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడు నాంచారయ్య అని పేర్కొన్నారు. 2013 లోనే భాస్కర రావు హత్యకు కుట్ర చేశారని వివరించారు. ఈ హత్యకు నాలుగు నెలల నుండి పథకం రూపొందించారని తెలిపారు. ఐదు రోజులు రేక్కీ నిర్వహించిన తరవాత హత్యకు పూనుకున్నారన్నారు. ఈ హత్యకు నిందితులుగా ముగ్గురుకి కొందరు సహాయం చేశారని పేర్కొన్నారు. భాస్కరరావును హత్య చేస్తున్నట్లు కొల్లు రవీంద్ర కు నిందితులు తెలిపారని వివరించారు. జాగ్రత్తగా హత్య చేయాలనీ, తనతో మాట్లాడవద్దని కొల్లు చెప్పినట్లు తెలిపారు. తన పీఏతో మాట్లాడాలని అన్నట్లు తెలిపారు. తన పెరు బయటకు రాకుండా చూడాలని కొల్లు రవీంద్ర చెప్పారని పోలీసులు తెలిపారు. నోటీసుల ఇవ్వడానికి ఇంటికి వెళ్తే రవీంద్ర పరారయ్యారని, దీంతో పోలీసులు అప్రమత్తమై విశాఖ పారిపోతున్న సమయంలో అరెస్టు చేశామని ఎస్పీ రవీంద్ర బాబు అన్నారు. భాస్కర రావు హత్య కేసును అన్ని కోణాల్లో విచారించామని తెలిపారు. హత్యకు 15 రోజుల ముందు కొల్లు రవీంద్రను నిందితుడు నాంచారయ్య కలిశారని పేర్కొన్నారు. ఫోన్ కాల్ వివరాలు తెలుసుకున్న అనంతరం అరెస్టు చేశామని వివరించారు.