- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీటింగ్ కేసులో ఇరుక్కున్న ఫేమస్ డ్యాన్సర్.. అరెస్ట్ వారెంట్ జారీ
దిశ, సినిమా: ప్రముఖ డ్యాన్సర్ సప్నా చౌదరి ఓ పెద్ద వివాదంలో చిక్కుకుంది. తాజాగా లక్నోలోని స్థానిక కోర్టు ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నానంటూ డబ్బులు వసూలు చేసిన సప్న అండ్ టీమ్.. ఆ ప్రొగ్రామ్ రద్దు చేసినా టిక్కెట్ హోల్డర్లకు మనీ తిరిగి చెల్లించలేదనే ఆరోపణలపై అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శంతను త్యాగి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అంతేకాకుండా కేసు తదుపరి విచారణ తేదీ నవంబర్ 22న ఉంటుందని, ఆమెను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు.
2018 అక్టోబర్ 13న లక్నోకు చెందిన స్మృతి ఉప్వాన్ సప్నా చౌదరి డ్యాన్స్ షో కోసం ఏర్పాట్లు చేసినా.. అటెండ్ కాకపోవడంతో రద్దు చేశారు. కానీ రూ.300 టికెట్‌తో సప్న డ్యాన్స్ ప్రొగ్రామ్ కోసం వెయిట్ చేసిన అభిమానులకు తిరిగి డబ్బు చెల్లించకపోవడంతో.. అందరూ కలిసి అక్టోబర్ 14న లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో డాన్సర్ సప్నా చౌదరితో పాటు షో నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.