బిగ్ బ్రేకింగ్ : ప్రియురాలి హత్య ఆపై ప్రియుడు కూడా..!

by Sumithra |   ( Updated:2021-07-29 11:48:33.0  )
muder-and-sucide
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని లెమన్ ట్రీ హోటల్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిని హత్యచేసి ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది. మృతులు వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండల కేంద్రానికి చెందిన రాములు, సంతోషిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రేమజంట మృతికి గల కారణాలపై హోటల్ సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story