- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని..
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమజంట దారుణానికి పాల్పడింది. గ్రామ శివారులోని ఓ చెట్టు కొమ్మకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువులో శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకివెళితే.. జిల్లాకు చెందిన మౌనిక, నవీన్ గత కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో ఇద్దరు ఒక్కటవ్వాలనుకున్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌కు ఇరు కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో మసస్తాపం చెందిన ప్రేమికులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు చివ్వెంల మండలం చందుపట్ల వాసి ఓర్పు నవీన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రేమజంట సూసైడ్ పై ఆరా తీశారు. స్థానికులు, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఇరుకుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.