మైనర్‌ వ్యవహారం.. పెళ్లికి నో అన్నందుకు ప్రేమజంట ఆత్యహత్య

by Sumithra |
మైనర్‌ వ్యవహారం.. పెళ్లికి నో అన్నందుకు ప్రేమజంట ఆత్యహత్య
X

దిశ, కుత్బుల్లాపూర్ : పెద్దలు పెళ్ళికి నిరాకరించడంతో ఓ ప్రేమ జంట క్వారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్టలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మైనర్(17) అదే ప్రాంతానికి చెందిన విశాల్(21)లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.పెళ్లి చేసుకుందామని ఇరు కుటుంబ పెద్దలకు చెప్పడంతో అమ్మాయి తరఫు వారు తర్వాత చేద్దామని సర్దిచెప్పి వదిలేశారు. ఆ తర్వాత బాలిక కనిపించకుండా పోయింది.

దీంతో విశాల్‌పై అనుమానంతో మైనర్ బంధువులు శనివారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. ఇదిలాఉండగా ఆదివారం సాయంత్రం గాజులరామారం బాలయ్య నగర్‌లోని క్వారీ గుంతలో రెండు మృతదేహాలు తేలి ఉన్నాయని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదైన బాలికగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story