పెద్దలు ఒప్పుకోరని ప్రేమజంట ఆత్మహత్య

by Shyam |
పెద్దలు ఒప్పుకోరని ప్రేమజంట ఆత్మహత్య
X

దిశ, వెబ్‎డెస్క్ :
తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందని భయపడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాండూరు మండలం మల్‎రెడ్డిపల్లికి చెందిన కీర్తన, బాలరాజ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం ఇరువురి ఇళ్లలో తెలిసిపోయింది. తమ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో ఒప్పుకోరనే మనస్తాపంతో వ్యవసాయ పొలం వద్ద ఇరువురు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. కీర్తన అక్కడికక్కడే మృతి చెందగా.. బాలరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ప్రేమికులిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed