- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దేశంలో తెలుగు MP అభ్యర్థి సంచలనం.. అఫిడవిట్‌లో రూ.5,785 కోట్ల ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజకీయాలను టీడీపీ ఎంపీ అభ్యర్థి తనవైపు తిప్పుకున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో వంద కాదు రెండొందలు కాదు ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగా పేర్కొన్నారు. ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం రాజకీయాలను ఫాలో అయ్యే వారికి గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించిన నాటి నుంచి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం నిర్వహించారు.
తాజాగా.. ఇవాళ చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో తన కుటుంబానికి రూ.రూ.5,785 కోట్ల ఆస్తి ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో దేశంలోనే చంద్రశేఖర్ అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలస్తున్నారు. అందులో చరాస్తుల విలువ రూ.5,598.65 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. ఆయనకు రూ.1,038 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వృత్తి రీత్యా వైద్యుడైన చంద్రశేఖర్ అమెరికాలో సుదీర్ఘంగా వైద్య వృత్తిలో కొనసాగారు. వైద్య వృత్తితో పాటు వివిధ వ్యాపార రంగాల్లో రాణించి సక్సెస్ అయ్యారు.