పొలిటికల్ థ్రిల్లర్‌గా లోకనాయకుడి మూవీ?

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కేవలం మూడు అంటే మూడు సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ‘మానగరం, ఖైదీ’ సినిమాల ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్న లోకేష్.. ఆ తర్వాత ఏకంగా ఇళయ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి ‘మాస్టర్’ మూవీ తెరకెక్కించారు. కరోనా కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడగా.. విడుదలైతే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ పడినట్లే.

ఇదిలా ఉండగానే మరో బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినట్లు నిన్ననే ప్రకటించాడు డైరెక్టర్ లోకేష్. లోక నాయకుడు కమల్ హాసన్‌తో కలిసి బిగ్గెస్ట్ మూవీ అనౌన్స్ చేశారు. ఇప్పటికే మాసివ్ అటెన్షన్ క్యాచ్ చేసిన లోకేష్.. కమల్‌తో సినిమా అనగానే భారీ హైప్ క్రియేట్ అయింది. లోకనాయకుడికి ఇది 232వ సినిమా కాగా, సూపర్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కనుందని కోలీవుడ్ టాక్. ప్రేక్షకులకు తన అమేజింగ్ టేకింగ్‌తో ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడంలో సూపర్ సక్సెస్ అయిన లోకేష్.. హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసే కంటెంట్ రెడీ చేశాడని తెలుస్తోంది.

కమల్ హాసన్‌తో సినిమా అంటేనే ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ రాగా.. నెక్స్ట్ మూవీ రజినీకాంత్‌తో ఉంటుందని రాజ్ కమల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తాడని న్యూస్ హల్ చల్ చేస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. డైరెక్టర్ అమేజింగ్ ట్రీట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

Advertisement